Hyderabad Metro: రూ.59 లకే హైదరాబాద్ మెట్రోలో అపరిమిత ప్రయాణం
మొదట్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు మాత్రం విపరీతంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరి కోసం గాను.. మెట్రో సిబ్బంది ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..
Hyderabad Metro: ప్రారంభించిన సమయంలో హైదరాబాద్ మెట్రో రైలుకు ఆధరణ తక్కువే ఉండేది. కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయిదు నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తున్నా కూడా ఉదయం మరియు సాయంత్రం సమయంలో అత్యంత రద్దీగా ఉంటున్నాయి. కనీసం నిల్చునేందుకు కూడా ప్లేస్ ఉండటం లేదు. మెట్రోకి వస్తున్న ఆధరణ నేపథ్యం లో మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నా సంస్థ ఇంకా ప్రయాణికుల సంఖ్య ను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంది. మెట్రో ప్రయాణం వల్ల ఎంతగా సౌకర్యం మరియు లాభం ఉంది అనే విషయాలను తెలియజేస్తూ ఆఫర్లను మెట్రో రైలు సంస్థ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూపర్ సేవర్ ఫ్రీడర్ ఆఫర్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే వీక్ మొత్తం కూడా రోజుకు రూ.59 లకే అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. సాధారణంగా అయితే అపరిమితంగా ప్రయాణించాలి అంటే వందల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఆఫర్ వల్ల కేవలం రూ.59 లకే రోజు అంతా కూడా ఎక్కడి నుండి ఎక్కడికి అయినా ప్రయాణించవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ను వారం రోజుల పాటు కొనసాగించడం ద్వారా మరింత మందిని మెట్రో రైలు ప్రయాణానికి ప్రోత్సహించినట్లు అవుతుందని మెట్రో రైలు యాజమాన్యం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బంపర్ ఆఫర్ ను సామాన్యులు ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది.
Also Read: College Building Collapsed: భారీవర్షాలకు పేకమేడలా కుప్పకూలిన కాలేజ్ బిల్డింగ్
రూ.59 లకే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్ ను రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో అపరిమితమైన మెట్రో రైడ్ ను ఆస్వాదించవచ్చు అంటూ సంస్థ పేర్కొనడం జరిగింది. సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డ్ ను ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు అందించడం ద్వారా మంచి ప్రమోషన్ లభించడం తో పాటు అన్ని విధాలుగా మంచి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు ఈ మెట్రో ఆఫర్ ను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. తమ కస్టమర్లకు ఈ ఆఫర్ లను అందించడం చాలా సంతోషంగా ఉందని. ముందు ముందు మరింత మంది ని తమ తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు హైదరాబాద్ మెట్రో పని చేస్తుందని ఎండీ మరియు సీఈఓ అయిన కే వీ బి రెడ్డి అన్నారు.
Also Read: Himachal Pradesh Rains: శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి